హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటిపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి

VZM: విధి నిర్వహణలో బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగి, ప్రవృత్తిలో విభిన్న కళారూపాలతో అందరినీ ఆకట్టుకునే కళాకారిణి నీటిపై రంగులతో అందమైన రంగవల్లులు సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న డి.టి నాగలక్ష్మి. ప్రస్తుతం గంట్యాడ మండలకార్యాలయంలో డి.టీ.గా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగబాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూనే సృజనాత్మకతను పదును పెడుతున్నారు.