WGL: సంగెం మండలం గవిచర్లలో పత్తి చేనులో పనిచేస్తున్న దంపతులపై కర్రలు, రాళ్లతో దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం కొయ్యడ భూమాత, నవీన్ దంపతులపై కొయ్యడ సదయ్య, శ్రీనివాస్, లావణ్య దాడి చేయడంతో గాయాలయ్యాయి. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ముప్పు రమేశ్ కూడా గాయపడ్డాడు.కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.
తెలంగాణ
దంపతులపై దాడి.. ముగ్గురిపై కేసు


