హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లీడ్‌లెస్ పేస్‌మేకర్‌తో ప్రాణదానం

నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యులు 76 ఏళ్ల వృద్ధురాలికి లీడ్‌లెస్ పేస్‌మేకర్ అమర్చి ప్రాణాపాయం తప్పించారు. కంప్లీట్ హార్ట్ బ్లాక్, కిడ్నీ వైఫల్యం, సెప్సిస్‌తో నిమిషానికి 36 గుండె కొట్టుకునే స్థితిలో చేరిన ఆమెకు వెంటిలేటర్, డయాలసిస్ అందించారు. డాక్టర్ దర్గా సాహెబ్ పీర్ బృందం అక్టోబర్ 8న శస్త్రచికిత్స చేసింది.