హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై ప్రజలకు పోలీసుల అవగాహన

BPT: కారంచేడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలోని స్వర్ణ గ్రామంలో పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంకోల్లు సీఐ రామానాయక్, కారంచేడు ఎస్సై పీ.గోపి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో గొడవలు, ఘర్షణలకు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని సూచించారు. ఎన్నికల నియమాలను పాటించాలని, చట్టవిరుద్ధ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు.