NDL: ఆళ్లగడ్డ పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగడంతో నాలుగు రోడ్ల కూడలి యందు ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ప్రజలు గుంపులుగా ఉండవద్దని పోలీసులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఆళ్లగడ్డ పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు


