హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు

కోనసీమ: రామచంద్రపురం 2వ వైసీపీ వార్డుకు చెందిన 25 మంది కార్యకర్తలు ఆదివారం టీడీపీలో చేరారు. టీడీపీ నేత వాసంశెట్టి సత్యం, ఏఐసీసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై చేరినట్లు వారు తెలిపారు. పార్టీలోకి వచ్చిన వారికి కండువాలు వేసి సత్యం సాదరంగా ఆహ్వానించారు.