హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అనకాపల్లిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు'

అనకాపల్లి డివిజన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని డీఎస్పీ పీవీవీ నరసింహారావు తెలిపారు. సభలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, నగదు, మద్యం పంపిణీ, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSP హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.