కోనసీమ: అమలాపురం మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు భౌతిక కాయానికి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఆదివారం రాత్రి నివాళులర్పించారు. ఉప్పలగుప్తం మండలం గోపవరంలో మాజీ ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజాసేవలో, టీడీపీ బలోపేతంలో బుచ్చి మహేశ్వరరావు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఎంపీ గంటి హరీశ్ మాధుర్, తదితరులు నివాళులు అర్పించారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ ఎంపీకి నివాళులు అర్పించిన ఎంపీ


