AKP: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు సెలవులు తీసుకోవద్దని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. శని, ఆదివారాలు, దసరా సెలవులు కూడా వర్తించవని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. బాధ్యతగా పనిచేసి ఎన్నికలను విజయవంతం చేయాలని నిన్న పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రక్రియ ముగిసే వరకు సెలవులు లేవు: కలెక్టర్


