హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోని పరిధిలో పోలీసుల విస్తృత తనిఖీలు

KRNL: ఆదోనిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఆదివారం రాత్రి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. 1టౌన్ సీఐ యుగంధర్‌ ఆధ్వర్యంలో SI గోపాలరాజు, స్పెషల్‌ ఫోర్స్‌ బలగాలు ఓల్డ్‌ పోస్ట్‌ ఆఫీస్‌, ఖాజీపుర, గణేష్‌ సర్కిల్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజల్లో భద్రతాభావం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు.