KDP: కమలాపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ పదవికి TDP తరఫున స్వప్న దివాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతో పాటు TDPకి చెందిన మరో ఇద్దరు కూడా నామినేషన్లు వేశారు. అయితే వారు నేడు నామినేషన్లు ఉపసంహరించుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో స్వప్న దివాకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కమలాపురం ఛైర్‌పర్సన్‌గా స్వప్న..?


