హైదరాబాద్: 28°C
వార్తలు

ముగిసిన నామినేషన్ల పర్వం.. మొత్తం ఎన్నంటే?

AP; మున్సిపాల్ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ముగిసింది. 13 కార్పొరేషన్లలో మేయర్ పదవులకు 320 నామినేషన్లు వచ్చాయి. 87 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఛైర్‌పర్సన్ పీఠం కోసం బరిలో 1038 మంది నిలిచారు. ఎన్నికలు జరుగుతున్న పదమూడు కార్పొరేషన్లలో 3020 వార్డులుఉండగా 8198 మంది అభ్యర్థులు కార్పొరేటర్ పదవి కోసం పోటీలోకి దిగారు.