హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సరస్ మేళాతో మహిళలకు ఆర్థిక భరోసా'

NTR: విజయవాడ పున్నమి ఘాట్‌లో ఈ నెల 31 వరకు నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జి.లక్ష్మీశ కోరారు. 600 స్టాళ్లు, 50 ఫుడ్ కోర్టులతో 32 రాష్ట్రాల నుంచి 1,500 మంది మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారని తెలిపారు. గ్రామీణ మహిళల ఉత్పత్తులను కొనుగోలు చేసి వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడాలని పిలుపునిచ్చారు.