హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొండాపురం నూతన ఎస్సైగా సూర్యనారాయణ రెడ్డి

KDP: కొండాపురం నూతన ఎస్సైగా జి. సూర్యనారాయణ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. నాటుసారా, అక్రమ మద్యం, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా నిరంతరం అందుబాటులో ఉటామని తెలిపారు.