హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిక

కృష్ణా: గన్నవరం మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన 30 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా వంశీ పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీలోకి మారడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.