హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుట్టపర్తి మున్సిపాలిటీలో 99 నామినేషన్లు

SS: పుట్టపర్తిలోని 28 వార్డులకు సంబంధించి వివిధ పార్టీల నుంచి 99 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 48, వైఎస్సార్‌సీపీ నుంచి 37, జనసేన నుంచి 5, బీజేపీ నుంచి 4, స్వతంత్రుల నుంచి 5 నామినేషన్లు నమోదయ్యాయి. చైర్‌పర్సన్ పదవులకు 16 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో స్వతంత్రులు 5, జనసేన 4, టీడీపీ 3, వైసీపీ 2, బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కటి ఉన్నాయి.