హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి కేసులో మరో ఇద్దరి అరెస్ట్

కృష్ణా: గుడివాడలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాల కేసులో మరో ఇద్దరిని వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. బైపాస్ రోడ్డులోని కేకేఆర్ గౌతమ్ స్కూల్ సమీపంలో బండి సంజయ్, అప్పారావును అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 13 మంది నిందితులకు గాను ఇప్పటివరకు ఎనిమిది మంది అరెస్టయ్యారు. గతంలో సుమారు 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.