హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఎన్నికల కేంద్రాల్లో 28న సెలవు: కలెక్టర్

కృష్ణా: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఈ నెల 28న స్థానిక సెలవుగా ప్రకటించినట్టు కలెక్టర్ డీకే బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న మచిలీపట్నం, పెడన, ఉయ్యూరులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.