హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాలవ

ATP: రాయదుర్గంలోని 8వ వార్డులో దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో MLA కాలవ శ్రీనివాసులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కుమారి హారిక మంజునాథ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆసక్తిగా విన్నారు. ప్రజలందరిపై జగన్మాత ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.