హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి'

కృష్ణా: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా సాధారణ పరిశీలకులు కె.వి.ఎన్. చక్రధర్ బాబు సూచించారు. కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల వ్యయాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని వ్యయ పరిశీలకులు కె.వి. శ్రీకాంత్ తెలిపారు.