NTR: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కార్పొరేటర్ల నామినేషన్ల దాఖలుకు గడువు ఆదివారంతో ముగిసింది. మొత్తం 86 డివిజన్లకుగాను 968 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కార్యాలయ అధికారులు తెలిపారు. ఆదివారం ఒక్కరోజే 707 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో తదుపరి ఎన్నికల కార్యక్రమంపై అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో 968 నామినేషన్లు


