NZB: సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా బతుకమ్మను పేర్చి, పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఆడపడుచులంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మను పేర్చి పూజలు చేసిన కవిత


