CTR: జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఇవాళ యథావిధిగా పనిచేస్తాయని LDM ఇనూస్ షేక్ ఆదివారం తెలిపారు. మహర్నవమి సందర్భంగా బ్యాంకులకు సెలవు లేదని, మంగళవారం విజయదశమి సందర్భంగా సెలవు ఉంటుందని ఆయన వెల్లడించారు. సోమవారం బ్యాంకింగ్ సేవలు పొందాలనుకునే ఖాతాదారులు యథావిధిగా తమ లావాదేవీలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు బ్యాంకులకు నో హాలిడే!


