హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చంద్రప్రభ వాహనసేవలో కళాకారుల ప్రదర్శనలు

TPT: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం చంద్రప్రభ వాహనసేవలో 8 రాష్ట్రాలకు చెందిన 17 కళాబృందాల 453 మంది కళాకారులు నృత్యగానాలతో భక్తిసేవ సమర్పించారు. భరతనాట్యం, కోలాటం తదితర సంప్రదాయ కళారూపాలతో పాటు శ్రీకృష్ణ లీలలు, రామాయణం, అష్టలక్ష్మీ వైభవం వంటి ఆధ్యాత్మిక ఇతివృత్తాలను ప్రదర్శించి భక్తులను ఆకట్టుకున్నారు.