హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరు చైర్‌పర్సన్ అభ్యర్థికి లైన్ క్లియర్..?

CTR: పుంగనూరు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి నయీమ్ తాజ్ ఎన్నికకు లైన్ క్లియర్ అయినట్లే తెలుస్తోంది. ఆదివారం నామినేషన్ల గడువు ముగిసే సమయానికి YCPతో పాటు ఇతర పార్టీ తరఫున ఎవరూ చైర్‌పర్సన్‌ అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో నయీమ్ తాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది. అయితే ఆమె ఏకగ్రీవ ఎన్నికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.