హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ దాఖలు చేసిన జనసేన అభ్యర్ధి

కృష్ణా: పెడన మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి బళ్ళ జ్ఞాన లింగ నాగ జ్యోస్నా రాణి ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, మాజీ బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ బొడ్డు వేణుగోపాలరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు.