హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్వాక్రా ఉత్పత్తులు త్వరలో అమ్మకాలు

VZM: అఖిల భారత డ్వాక్రా బజార్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు DRDA పీడీ శ్రీనివాస పాణి తెలిపారు. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రదర్శనను NRLM–సెర్ప్‌ ఏపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల డ్వాక్రా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయానికి అందుబాటులో ఉంచుతామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.