హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరమ్మత్తులతో మళ్లీ మెరవనున్న గిరిజన మ్యూజియం!

అరకులోయ గిరిజన మ్యూజియంలోని కళాకృతులకు ఎన్నో ఏళ్ల తర్వాత మరమ్మత్తులు ప్రారంభమయ్యాయి. పాడేరు ఐటీడీఏ పర్యాటక సెల్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నట్లు డివిజనల్ మేనేజర్ గణపతి ఆదివారం తెలిపారు. శీతాకాల పర్యాటకుల రాకకు ముందే మరమ్మత్తులు చేపట్టడంతో మ్యూజియం కొత్త రంగులతో సరికొత్త అందాలను సంతరించుకుని పర్యాటకులను ఆకట్టుకోనుంది.