హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి పీజీఆర్‌ఎస్ కార్యక్రమం రద్దు

BPT: జిల్లాలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఎన్నికల విధుల్లో అధికారులందరూ బిజీగా ఉండటం, ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 19న ఈ కార్యక్రమం తాత్కాలికంగా జరగదని బాపట్ల ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.