హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటో బొల్తాపడిన ఘటనలో వ్యక్తి మృతి

PPM: సీతంపేట మండలంలోని దిగువ తొత్తడి–కిట్టలపాడు రహదారి మలుపు వద్ద ఆదివారం సాయంత్రం ఆటో బోల్తాపడిన ఘటనలో సవర లక్ష్మణరావు (35) అక్కడికక్కడే మృతి చెందాడు. హిరమండలం మండలం దిబ్బగూడ గ్రామానికి చెందిన లక్ష్మణరావు, బుడ్డడుగూడలో శుభకార్యం ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆటోలో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.