KRNL: ఉమ్మడి జిల్లాలో రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్


