సత్యసాయి: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ప్రశాంతంగా ముగిసింది. ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ పర్యవేక్షణలో పుట్టపర్తి, హిందూపురం తదితర మున్సిపాలిటీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణ సజావుగా సాగింది. ఇక ఈ నెల 28న పోలింగ్, 30న ఫలితాలు వెలువడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్
సజావుగా ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ


