హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సీపట్నంలో ప్రచారం ప్రారంభం

AKP : నర్సీపట్నంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం తెరలేచింది. పినారిపాలెం రామాలయం వద్ద టీడీపీ చైర్ పర్సన్ అభ్యర్థిని పద్మావతి ఎంపీ చింతకాయల విజయ్ తో కలిసి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి చేస్తున్న వ్యక్తులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టిడిపి అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.