VZM: రేగిడి మండలం కొమిరి సమీపంలోని నాగావళి నది ఒడ్డున మహిళ మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు మృతదేహం కొట్టుకొచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కొమిరి, పాలకొండ మండలం కిలాంతరి సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్
నాగావళి నదిలో మహిళ మృతదేహం


