హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయచోటి జడ్పీటీసీ అభ్యర్థిగా వెంకటరమణమ్మ

రాయచోటి: సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ తరఫున రాయచోటి జడ్పీటీసీ అభ్యర్థిగా మావులూరి వెంకటరమణమ్మను ప్రకటించినట్లు పార్టీ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మూడు నక్షత్రాల గుర్తుపై ఓటు వేసి వెంకటరమణమ్మను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.