హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఎన్నికల పరిశీలకుల నియామకం

అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణకు జనరల్ అబ్జర్వర్‌గా జి. బాలకృష్ణ, ఎన్నికల వ్యయ పరిశీలకురాలిగా ఎం. బబితా నియమితులైనట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఆదివారం మదనపల్లి కలెక్టరేట్‌లో వారితో సమావేశమై ఎన్నికల నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఎన్నికల మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.