KMM: జిల్లాలో పర్యటిస్తున్నDy. CM భట్టి నాచారం వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏన్కూరు-నాచారం నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి పనులకు రూ.90వేల కోట్ల కేటాయించినట్లు పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకు రూ.2వేలకోట్లు, భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ.276 కోట్లు, బాసర ఆలయ అభివృద్ధికి రూ.354 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
తెలంగాణ
ఏన్కూరు-నాచారం రహదారికి శంకుస్థాపన


