హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్వకుర్తిలో పండగ సందడి

NGKL: విజయదశమి, శరన్నవరాత్రి పండుగల నేపథ్యంలో కల్వకుర్తి పట్టణంలో ఆదివారం సందడి నెలకొంది. పూలు, పండ్లు, వస్త్రాలు, పూజా సామగ్రి దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఇదే అదునుగా వ్యాపారులు ధరలు పెంచడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ప్రధాన రహదారుల్లో వాహనాల రద్దీ పెరగడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.