హైదరాబాద్: 28°C
తెలంగాణ

అశోక ధమ్మచక్ర పరివర్తన దినోత్సవ పాంప్లెట్‌ విడుదల

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 29న అశోక ధమ్మచక్ర పరివర్తన దినోత్సవంకి సంబంధించిన పాంప్లెట్‌ను రాజ్యాంగ రక్షణా దళ్ ఫౌండర్ రెంజర్ల రాజేష్ ఆదివారం విడుదల చేశారు. రాజేష్ మాట్లాడుతూ.. ధమ్మచక్ర పరివర్తన దినోత్సవ ప్రాముఖ్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.