హైదరాబాద్: 28°C
తెలంగాణ

కైలాసం గుట్టపై కాషాయం జండా ఆవిష్కరణ

NGKL: కల్వకుర్తి పట్టణంలోని కైలాసం గుట్టపై ఉన్న హనుమాన్ దేవాలయం ఆవరణంలో దసరా ఉత్సవాల సందర్భంగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కౌన్సిలర్ భావండ్ల మధు ఆదివారం కాషాయం జెండాను ఆవిష్కరించారు. అనంతరం హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. త్యాగం, ధైర్యం, జ్ఞానం, ధర్మం, సేవాభావం, ఆధ్యాత్మిక చైతన్యానికి ఇది ప్రతీక అని వారు తెలిపారు.