హైదరాబాద్: 28°C
తెలంగాణ

కానిస్టేబుల్ దురుసు ప్రవర్తనపై ఫిర్యాదు

SRCL: ఎల్లారెడ్డిపేటపోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ షబ్బీర్ పాషా మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించి దాడి చేశారని బీజేపీ నేత వంగల రాజు రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఫ్లెక్సీ తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. నిందిత కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు రామచంద్రరెడ్డి డిమాండ్ చేశారు.