VKB: కొడంగల్ మండలం టేకులకోడ్ గ్రామానికి చెందిన కుర్వ హన్మంతు కుమారుడు కుర్వ రాజు నీట్ పరీక్షలో 419 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 5,704వ ర్యాంకు పొందారు. దీంతో ఎంబీబీఎస్లో ప్రవేశం సాధించారు. ఈ సందర్భంగా నవీన సాయి పాఠశాల ప్రిన్సిపాల్ కె. రవి దంపతులు రాజును ఘనంగా సన్మానించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
వైద్య విద్యలోకి టేకులకోడ్ విద్యార్థి


