హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఆర్థిక సమ్మిళిత ప్రచారం: కలెక్టర్

BDK: జిల్లాలో అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో ఆర్థిక సమ్మిళిత ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. బ్యాంకు ఖాతాలు, బీమా, పింఛను పథకాల్లో అర్హులకు అవకాశం కల్పించనున్నారు. ప్రజలు ఆధార్, బ్యాంకు పాస్‌బుక్ తదితర పత్రాలతో శిబిరాలకు హాజరై సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ అంకిత్ కోరారు.