హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్పీకర్‌కు నవరాత్రి ఉత్సవాల ఆహ్వానం

VKB: జిల్లాలోని ఆలంపల్లిలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థాన నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆలయ ప్రతినిధులు ఆహ్వానించారు. కౌన్సిలర్ లంక లక్ష్మీకాంత్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు స్పీకర్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.