హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రాణం నిలిపిన హెల్మెట్

WGL: వర్ధన్నపేట పట్టణంలో ఆదివారం ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురయ్యాడు. అయితే, హెల్మెట్ ధరించి ఉండటంతో తలకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చాటిచెబుతోంది.