హైదరాబాద్: 28°C
తెలంగాణ

కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

NGKL బల్మూర్ మండలం నర్సాయిపల్లి గ్రామంలో అమరుడు కామ్రేడ్ చందు స్మారక స్థూపాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం అమరులు చేసిన త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. స్మారక స్థూపాలు ప్రజా పోరాటాల చరిత్రకు, అమరుల ఆశయాలకు ప్రతీకలని పేర్కొన్నారు.