హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖిల్లా రామాలయానికి రూ.35 కోట్లతో రోప్‌వే

NZB: ఖిల్లా రామాలయానికి సుమారు రూ.35 కోట్లతో రోప్‌వే మంజూరైనట్లు అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ తెలిపారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, రోప్‌వే నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఖిల్లా రామాలయాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.