MBNR: రాజాపూర్ మండలం యారన్పల్లి తండాలో రైతు కిష్ట్యా నాయక్కు చెందిన ఎండిపోయిన వరి పంటను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పరిశీలించారు. విద్యుత్ కోతలతో పంటకు నీరందక పెట్టుబడి నష్టపోయామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు.
తెలంగాణ
ఎండిన వరి పంటను పరిశీలించిన లక్ష్మారెడ్డి


