హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

GDWL: ఉండవెల్లి మండలం బొంకూరు–పోతులపాడు స్టేజీ సమీపంలో శనివారం రాత్రి జరిగిన కారు–ఆటో ప్రమాదంలో శాంతినగర్ గ్రామానికి చెందిన దుర్గప్ప మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి దుర్గప్ప మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యంచెప్పి ప్రగాఢ సానుభూతి తెలిపారు.