హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సింగరేణిని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్ర

SRPT: సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఈరోజు సూర్యాపేటలో మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తిని తగ్గిస్తూ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా బొగ్గు కొనుగోళ్లు జరిపేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిని దెబ్బతీసే ఈ ప్రభుత్వ చర్యలను అందరూ గమనిస్తున్నారని హెచ్చరించారు.